24 గంటల్లో 34 రిజిస్ట్రేషన్లు
22ఏ పొరపాట్లను సరిదిద్దుతున్నాం: పొంగులేటి 15 రోజులపాటు రోజువారీగా దరఖాస్తుల పరిశీలన ప్రజల హక్కులు, ఆస్తులకు పూర్తి రక్షణ కల్పిస్తామని స్పష్టీకరణ హైదరాబాద్, ఆగస్టు 18 (మన విశ్వం): 22ఏ నిషేధిత జాబితాలో పొరపాటున చేరిన ప్రైవేటు ఆస్తుల సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తున్నామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సమస్యను గుర్తించిన 24 గంటల్లోనే మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో 30, రంగారెడ్డి జిల్లాలో 4 కలిపి 34 రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు ఆదేశాల మేరకు వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే క్రమంలో కొన్ని ప్రైవేటు ఆస్తులు సాంకేతిక పొరపాట్లతో 22ఏ జాబితాలో చేరాయని చెప్పారు. ‘‘పొరపాటును...