నూనె మిల్లులో ఘోరం.. పళ్లచక్రాల్లో మహిళ చేయి!

నూనె పట్టించుకునేందుకు వెళ్లి ప్రమాదం సిబ్బంది అప్రమత్తతతో నిలిచిన యంత్రం.. ఆసుపత్రికి తరలింపు నల్లబెల్లి, (మన విశ్వం): గృహ అవసరాల కోసం నూనె పట్టించుకునేందుకు వెళ్లిన ఓ మహిళకు ఊహించని ప్రమాదం ఎదురైంది. నూనె గింజలను యంత్రంలో వేస్తుండగా ప్రమాదవశాత్తు చేయి పళ్లచక్రాల మధ్య చిక్కుకోవడంతో తీవ్రంగా నలిగి ఎముకలు విరిగిన ఘటన నల్లబెల్లి మండల కేంద్రంలోని ఓ నూనె మిల్లులో చోటుచేసుకుంది. రంగాపురం గ్రామానికి చెందిన కందగట్ల కవిత స్థానిక మహిళా బ్యాంకులో సీఏగా పనిచేస్తున్నారు. గృహ అవసరాల నిమిత్తం నూనె పట్టించుకునేందుకు నల్లబెల్లిలోని ఓ మిల్లుకు వెళ్లారు. గింజలను యంత్రంలో వేస్తున్న సమయంలో ఆమె చేయి ఒక్కసారిగా పళ్లచక్రాల మధ్య చిక్కుకుంది. యంత్రం...