విగ్రహ వివాదం వేళ.. ఇద్దరు సీఐల బదిలీ!
నర్సంపేట రూరల్, నెక్కొండ సీఐలు వీ.ఆర్‌కు కొత్తగా జే.శంకర్‌రావు, కే.ఫణిందర్‌ల నియామకం పెద్ది విగ్రహం వివాదం నేపథ్యంలోనేనా?.. నర్సంపేట లో జోరుగా చర్చ నర్సంపేట, ఆగస్టు 19 (మన విశ్వం): నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు, తొలగింపు వ్యవహారం రాజకీయంగా వేడి పుట్టిస్తున్న వేళ.. ఇద్దరు సీఐల బదిలీ చర్చనీయాంశమైంది. నర్సంపేట రూరల్ సీఐ సాయిరమణ, నెక్కొండ సీఐ శ్రీనివాస్‌లను వీ.ఆర్‌కు అటాచ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. వారి స్థానాల్లో జే.శంకర్‌రావు, కే.ఫణిందర్‌లను నియమించినట్లు తెలిసింది. విగ్రహం చుట్టూ ఉద్రిక్తత పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు కోసం నర్సంపేటలో నిర్మించిన గద్దెను అనుమతులు లేవన్న...