ముత్తజిపేటలో ఘోర ప్రమాదం.. ఒకరు మృతి

అదుపుతప్పి ఇంటిపైకి దూసుకెళ్లిన కారు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్ర గాయాలు గంధంపల్లి నుంచి మేడారం వెళ్తుండగా దుర్ఘటన నర్సంపేట, ఆగస్టు 19 (మన విశ్వం): మేడారం వెళ్తున్న ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం విషాదంలో ముంచింది. వరంగల్ జిల్లా ముత్తజిపేట గ్రామ సమీపంలో బుధవారం తెల్లవారుజామున కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న ఇంటిపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మహబూబాబాద్ జిల్లా గంధంపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని ఆరుగురు కారులో మేడారం వైపు బయలుదేరారు. ముత్తజిపేట సమీపానికి చేరుకోగానే కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఓ...