పొంగులేటిని తక్షణమే తప్పించండి.. రాహుల్ గాంధీకి హరీష్ లేఖ
‘తెలంగాణలో తీవ్ర పాలనా సంక్షోభం’ ‘30% వసూళ్ల దందా.. 50:50 ఒప్పందాలకు ఒత్తిళ్లు’ అంటూ ఆరోపణ రెవెన్యూ మంత్రి పొంగులేటిని తక్షణమే తొలగించాలని డిమాండ్ రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని విజ్ఞప్తి 2023 డిసెంబరు నుంచి 22ఏ చేర్పులు, తొలగింపులపై ఫోరెన్సిక్ ఆడిట్‌కు పట్టు హైదరాబాద్: తెలంగాణలో సెక్షన్ 22ఏ వ్యవహారంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి లేఖ రాశారు. అక్రమ రిజిస్ట్రేషన్లను అడ్డుకునేందుకు ఉద్దేశించిన చట్టపరమైన నిబంధనను ప్రైవేటు ఆస్తులను నిలిపివేసేందుకు దుర్వినియోగం చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ‘30 శాతం వసూళ్ల దందా’ సాగుతోందని, కొన్ని ఆస్తుల విషయంలో ముందుగా ఏర్పాటు చేసిన...