రబ్బరు చెప్పుల నుంచి కోట్లకు.. ఎలా హరీశ్‌?

‘‘పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని దోచుకున్నవారే ఇప్పుడు అవినీతి, కమిషన్ల గురించి నీతులు చెబుతున్నారా?’’ అంటూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్‌, మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై పోరాడాల్సింది పోయి.. అబద్ధాలను పదేపదే ప్రచారం చేస్తూ ప్రజల్లో ఆందోళన సృష్టించడమే బీఆర్ఎస్‌ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ‘హరీశ్‌ నోట అవినీతి మాటలా?’ కమిషన్లు, అవినీతి అంటూ హరీశ్‌రావు మాట్లాడటం విడ్డూరంగా ఉందని పొంగులేటి ఎద్దేవా చేశారు. ‘‘హరీశ్‌రావు అవినీతి గురించి మాట్లాడుతుంటే హంతకుడే సంతాపం తెలిపినట్లుంది. ఆయన నీతి వాక్యాలు వింటే సొంత పార్టీ నేతలే నవ్వుకునే పరిస్థితి’’ అని వ్యాఖ్యానించారు. పదేళ్ల బీఆర్ఎస్‌ పాలనలో...