పొంగులేటీ.. దమ్ముంటే అసెంబ్లీకి రా!
‘‘పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డీ.. మీ అవినీతి చిట్టా మొత్తం మా వద్ద ఉంది. రూ.15 వేల కోట్ల విలువైన ఫీనిక్స్ భూములు, ఆస్తులు మీకు సంబంధించిన సంస్థలకు ఎలా బదిలీ అయ్యాయో చెప్పే పత్రాలతో అసెంబ్లీకి వచ్చాం. దమ్ముంటే మీరు కూడా రండి.. ప్రజల ముందే తేల్చుకుందాం’’ అంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన సవాల్ విసిరారు. గన్‌పార్క్‌లో అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ నేతలతో కలిసి అసెంబ్లీ మీడియా పాయింట్‌కు చేరుకున్న ఏలేటి.. పొంగులేటిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఫీనిక్స్ కంపెనీ నుంచి పొంగులేటికి సంబంధించిన సంస్థలకు వేల కోట్ల విలువైన భూములు, ఆస్తులు బదిలీ అయ్యాయని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన...