పెద్ది సేవలకు గుర్తుగా కాంస్య విగ్రహం
బీఆర్‌ఎస్ ముందుకు రాకపోతే ప్రజల సహకారంతో మేమే ఏర్పాటు చేస్తాం అన్ని అనుమతులతో గౌరవప్రదంగా ప్రతిష్ఠిస్తాం పీసీసీ సభ్యుడు రామానంద్ వెల్లడి నర్సంపేట(మన విశ్వం) : తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సేవలకు గుర్తింపుగా నర్సంపేటలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని పీసీసీ సభ్యుడు రామానంద్ తెలిపారు. విగ్రహం విషయంలో రాజకీయాలకు తావివ్వకుండా, ఆయన చేసిన ప్రజాసేవకు తగిన గౌరవం కల్పించాలని కోరారు. అవసరమైన అనుమతులు తీసుకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు బీఆర్‌ఎస్ నాయకులు ముందుకు రాకపోతే కాంగ్రెస్ కార్యకర్తలే ప్రజల సహకారంతో నిధులు సమీకరించి ఏర్పాటు చేస్తారని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెద్ది సుదర్శన్‌రెడ్డి...