నల్లబెల్లిలో ఘనంగా రాజీవ్‌గాంధీ జయంతి

నల్లబెల్లి,(మన విశ్వం): మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలను నల్లబెల్లి మండలంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు మాలోత్‌ చరణ్‌సింగ్‌, జిల్లా కార్యదర్శి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ దేశ ఆధునికీకరణలో రాజీవ్‌గాంధీ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు వైనాల అశోక్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి మోహన్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్లు చార్ల శివరెడ్డి, బత్తిని మల్లయ్య, కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి, ఎస్సీ సెల్‌...