‘కూతురు వ్యాఖ్యలకు నన్నెలా బాధ్యురాలిని చేస్తారు?’
తన కుమార్తె కొండా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సహజ న్యాయస్ఫూర్తికి విరుద్ధమని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవికి తన వివరణ అందజేశారు. ఆగస్టు 19న తన జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కొండా కుటుంబ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పలుచోట్ల వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారని సురేఖ తెలిపారు. తన స్వస్థలమైన గీసుగొండతో ఉన్న అనుబంధంతో అక్కడ నిర్వహించిన వేడుకలకు తన కుమార్తె సుస్మిత పటేల్ ముఖ్య అతిథిగా హాజరైందని...