'యమపాశాల్లా’ విద్యుత్ తీగలు..
ఒరిగిన స్తంభాలతో మండల ప్రజల ప్రాణసంకటం! అధికారుల నిర్లక్ష్యంపై భగ్గుమంటున్న గ్రామీణులు.. ప్రమాదం జరగకముందే స్పందించాలని వేడుకోలు మల్హర్ ఆగస్టు 20 (మన విశ్వం): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్ రావు మండల పరిధిలో విద్యుత్ వ్యవస్థ అధ్వానంగా మారి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. తాడిచెర్ల గ్రామంలోనీ రామరావు పల్లెలో కాకుండా మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ లైన్లు అత్యంత ప్రమాదకరంగా మారాయి. విరిగిపోయే స్థితికి చేరిన స్తంభాలు, నేలను తాకుతున్న హైటెన్షన్, ఎల్టీ కరెంట్ వైర్లు గ్రామీణులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాడిచెర్ల తో పాటు పరిసర గ్రామాల వీధుల్లో, వ్యవసాయ బాటల్లో స్తంభాలు పక్కకు ఒరిగిపోయి ఎప్పుడు కూలుతాయో తెలియని...