రెడ్డిలకో న్యాయం.. బీసీ మహిళకో న్యాయమా?

సుస్మిత మాట్లాడితే.. కొండా సురేఖకు షోకాజ్‌ ఎలా ఇస్తారు? ఇతర నేతల ఘాటు వ్యాఖ్యలకు లేని క్రమశిక్షణ ఇప్పుడే గుర్తొచ్చిందా? మేడారానికి దేవాదాయ మంత్రిని తీసుకెళ్లకపోవడం అవమానం కాదా? బీసీ మహిళలపై కక్షసాధింపు మానుకోవాలి తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయిని భరత్‌ ధ్వజం ‘‘రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు ఎన్ని వ్యాఖ్యలు చేసినా పట్టించుకోరు.. బీసీ మహిళ విషయంలో మాత్రం వెంటనే క్రమశిక్షణ గుర్తుకొస్తుందా? కుమార్తె మాట్లాడితే తల్లికి షోకాజ్‌ నోటీసు ఇవ్వడమేంటి?’’ అంటూ తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయిని భరత్‌ కాంగ్రెస్‌ నాయకత్వాన్ని ప్రశ్నించారు. మంత్రి కొండా సురేఖ విషయంలో జరుగుతున్న పరిణామాలు బీసీలను అవమానించేలా ఉన్నాయని ఆరోపించారు....