పొమ్మనలేక.. పొగబెడుతున్నారా?

కూతురు వ్యాఖ్యలకు తల్లిని బాధ్యురాలిని చేయడంపై ప్రశ్నలు మంత్రి ఏమీ అనకున్నా.. పదవి నుంచి తప్పించాలనే డిమాండ్లేంటి? ‘పార్టీలు మారారు’ అంటున్న నేతల రాజకీయ గతంపైనా చర్చ ఒక్కసారిగా ఎమ్మెల్యేల మూకుమ్మడి విమర్శల వెనుక మర్మమేంటి? అవమానించి.. ఆమెంతట ఆమె వెళ్లిపోయేలా చేస్తున్నారా? తెలంగాణ బ్యూరో, ఆగస్టు 21(మన విశ్వం) : వ్యాఖ్యలు చేసింది కుమార్తె.. వివరణ కోరింది తల్లిని! మాటలు సుస్మితవి.. రాజకీయ వేడి మాత్రం మంత్రి కొండా సురేఖ చుట్టూ! అంతటితో ఆగకుండా ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించాలంటూ కొందరు కాంగ్రెస్‌ నేతల నుంచి డిమాండ్లు! వరుసగా చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలతో కాంగ్రెస్‌లో ఇప్పుడు ఒకటే చర్చ..'సురేఖను పొమ్మనలేక పొగబెడుతున్నారా?' పరకాల రాజకీయాలపై,...