లంచమూ ‘ఫోన్‌పే’లోనే!
ఇంటి అనుమతి, నంబరు కోసం రూ.20 వేలు డిమాండ్ బేరం తర్వాత రూ.13 వేలకు ఒప్పందం మరో పంచాయతీ కార్యదర్శి ఫోన్‌పే ఖాతాకు బదిలీ ఏసీబీ వలలో లింగాయిపల్లి పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి మంచిర్యాల, ఆగస్టు 21(మన విశ్వం) : ఇంటి నిర్మాణానికి అనుమతి.. కొత్త ఇంటికి నంబరు కేటాయించేందుకు రూ.20 వేల లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శి చివరకు రూ.13 వేలకు బేరం కుదుర్చుకుని ఏసీబీకి చిక్కారు. నగదు తీసుకోకుండా మరో పంచాయతీ కార్యదర్శి ఫోన్‌పే ఖాతాకు డబ్బులు బదిలీ చేయించినా.. ఏసీబీ అధికారుల వల నుంచి తప్పించుకోలేకపోయారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లింగాయిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి జె.వరలక్ష్మి.. గ్రామంలో...