ఖర్గే వద్దకు వనపర్తి పంచాయితీ!

చిన్నారెడ్డిపై మేఘారెడ్డి ఫిర్యాదు దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడిని కలిసిన ఎమ్మెల్యే ఇక్కడ గాంధీభవన్‌ ముట్టడికి చిన్నారెడ్డి వర్గం మేఘారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు.. ధర్నా రెండు వర్గాల పోరుతో కాంగ్రెస్‌లో కలకలం హైదరాబాద్‌, ఆగస్టు 21 (మన విశ్వం): వనపర్తి కాంగ్రెస్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న వర్గ విభేదాలు అధిష్ఠానం గడపకు చేరాయి. మాజీ మంత్రి చిన్నారెడ్డిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేయగా.. అదే సమయంలో హైదరాబాద్‌లో చిన్నారెడ్డి అనుచరులు గాంధీభవన్‌ను ముట్టడించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దిల్లీ వెళ్లిన మేఘారెడ్డి ఖర్గేను కలిసి వనపర్తి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలను వివరించినట్లు సమాచారం. చిన్నారెడ్డి వ్యవహారశైలిపైనా ఆయన అధిష్ఠానం...