రూ.75 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్సై!

కేసు దర్యాప్తు చేసి చార్జిషీట్‌ దాఖలు చేసేందుకు రూ.75 వేల లంచం తీసుకుంటూ చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై బండెల బాలరాజ్‌ ఏసీబీకి చిక్కారు. ఈ వ్యవహారంలో కానిస్టేబుల్‌/రైటర్‌ బొట్ట రాఘవేంద్ర కుమార్‌పైనా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. చందానగర్‌ ఠాణాలో నమోదైన క్రైమ్‌ నంబరు 696/2026 కేసు దర్యాప్తు, చార్జిషీట్‌ దాఖలు విషయంలో అనుకూలంగా వ్యవహరించేందుకు ఎస్సై బాలరాజ్‌ ఫిర్యాదుదారుడిని రూ.75 వేలు డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ తెలిపింది. శనివారం ఆ మొత్తాన్ని స్వీకరించగా రంగారెడ్డి రేంజ్‌ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎస్సై కార్యాలయంలోని టేబుల్‌ డ్రాయర్‌ నుంచి రూ.75 వేలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఎస్సై అంతకుముందే రూ.20 వేల నగదు...