ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య సేవల విషయంలో ఊరట కలిగించే కీలక నిర్ణయం అమల్లోకి వచ్చింది. నూతన విధానాలతో రూపొందించిన ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) శనివారం నుంచి అమలులోకి వచ్చింది. ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఎంపానెల్‌ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు పొందేలా కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈహెచ్‌ఎస్‌ అమలుపై తెలంగాణ సచివాలయంలో ఎంప్లాయీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. టీజీ-జేఏసీ ఛైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ట్రస్ట్‌ బోర్డు సభ్యులతో పాటు తెలంగాణ స్టేట్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌, అపోలో, కాంటినెంటల్‌, యశోద, కిమ్స్‌ తదితర కార్పొరేట్‌ ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు. పథకం...