‘30 ఏళ్లుగా వివాదం లేని ఇళ్లను నిషేధిత జాబితాలో ఎలా చేరుస్తారు?’

నిషేధిత జాబితా పేరుతో ప్రజల భూములు, ఇళ్లపై ఆంక్షలు విధించే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ప్రశ్నించారు. బోడుప్పల్‌ పరిధిలోని తిరుమల మెడోస్‌, లక్ష్మీ గణపతి కాలనీ, హేమానగర్‌కు చెందిన వందలాది మంది 22ఏ బాధితులు తమ సమస్యలను వివరించారని తెలిపారు. వారి ఆవేదన కలచివేసిందన్నారు. సర్వే నంబర్లు 215, 215 పార్ట్‌లలో సుమారు 30 ఏళ్లుగా ఎలాంటి వివాదాలు లేకుండా దాదాపు 1,500 కుటుంబాలు నివసిస్తున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. అలాంటి ఆస్తులను అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ కింద 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం దుర్మార్గమని విమర్శించారు. అవసరాల కోసం ఇల్లు అమ్ముకునేందుకు రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లినప్పుడు ఆస్తి నిషేధిత...