పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ఊపిరి

ప్రజాస్వామ్యం బలంగా నిలవాలంటే పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. పాలకులను ప్రశ్నించే స్వేచ్ఛ మీడియాకు ఉండాలని.. విమర్శలను స్వీకరించే ధైర్యం ప్రభుత్వాలకూ అవసరమన్నారు. ప్రజల గొంతుకగా మీడియా ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత పటిష్ఠంగా ఉంటుందని చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాల ప్రెస్‌క్లబ్‌ల ప్రతినిధులతో ఏర్పాటైన ‘ఫెడరేషన్‌ ఆఫ్‌ ప్రెస్‌ క్లబ్స్‌’ ను హైదరాబాద్‌లో భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఎనిమిది ప్రెస్‌క్లబ్‌ల ప్రతినిధులు భాగస్వాములైన ఈ వేదిక జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం, పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు తోడ్పడాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి ప్రజా చైతన్యం వరకు జర్నలిజం కీలక పాత్ర పోషించిందని భట్టి...