ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం: హరీశ్‌రావు
పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించే ఆరోగ్యశ్రీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిలు విడుదల చేయకపోవడంతో వైద్యసేవలపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న పలువురు సిబ్బందికి 18 నెలలుగా వేతనాలు అందడం లేదని పేర్కొన్నారు. వారి ఆవేదన చూస్తే గుండె కలిచివేస్తోందన్నారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రులకు 2023 నవంబరు నుంచి ఆరోగ్యశ్రీ నిధులు విడుదల కాలేదని, దాదాపు రూ.24 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. నిధుల విడుదలలో జాప్యంతో ఆసుపత్రుల నిర్వహణ, మందులు,...