కొండా సురేఖ షోకాజ్ నోటీసుపై రేవంత్‌రెడ్డి స్పందన
కాంగ్రెస్‌లో పదవులు, హోదాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖకు పార్టీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసిన వ్యవహారంపై ఆయన స్పందించారు. పార్టీ నిబంధనలు అందరికీ సమానంగానే వర్తిస్తాయని పేర్కొన్నారు. కొండా సురేఖకు ఇచ్చిన నోటీసుపై తాను ప్రత్యేకంగా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. పార్టీ అంతర్గత అంశాలను బహిరంగ వేదికలపై చర్చించబోనని చెప్పారు. ఈ వ్యవహారం ప్రస్తుతం క్రమశిక్షణా సంఘం పరిధిలో ఉందని, వివరణను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకోవాల్సింది ఆ సంఘమేనని స్పష్టం చేశారు. సుస్మిత వ్యాఖ్యలతో మొదలైన వివాదం ఇటీవల గీసుగొండలో జరిగిన కొండా సురేఖ జన్మదిన...