సింగరేణికి అంతర్జాతీయ ఖ్యాతే లక్ష్యం

తెలంగాణ జీవనాడి సింగరేణిని అంతర్జాతీయ స్థాయి సంస్థగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సంస్థను కాపాడుకుంటూనే.. భవిష్యత్‌ తరాలకు లాభదాయకంగా అందించేలా విస్తరణ ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణిని కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం చేయకుండా వ్యాపార విస్తరణపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. కాపర్‌, గ్రాఫైట్‌, లిథియం, కోబాల్ట్‌, బంగారం వంటి కీలక ఖనిజాల మైనింగ్‌లోకి అడుగుపెడుతున్నట్లు చెప్పారు. బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు నైని, తాడిచర్ల-2, మణుగూరు డిప్‌సైడ్-2 వంటి కీలక బ్లాక్‌లను సాధించామని పేర్కొన్నారు. కర్ణాటకలో బంగారు గని వేలంలో...