రాహుల్‌.. దమ్ముంటే తెలంగాణకు రా!

విద్యార్థుల భవిష్యత్తుపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలంగాణకు వచ్చి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సవాల్‌ విసిరారు. విద్యార్థుల సమస్యలపై ఇటీవల మాట్లాడుతున్న రాహుల్‌.. ముందుగా కాంగ్రెస్‌ పాలిత తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై స్పందించాలని డిమాండ్‌ చేశారు. ‘‘రాహుల్‌ గాంధీకి దమ్ముంటే తెలంగాణకు రావాలి. తన పార్టీ ప్రభుత్వాన్ని నిలదీసి విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ఇప్పించాలి. అప్పుడే విద్యార్థులపై ఆయనకున్న చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తుంది’’ అని పేర్కొన్నారు. తెలంగాణలో విద్యార్థులు, యువత కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పోరుబాట పట్టారని రాంచందర్‌రావు అన్నారు. ఎన్నికల సమయంలో వారికి ఇచ్చిన ప్రధాన...