‘ఫ్యూచర్‌ సిటీకి హార్వర్డ్‌.. సాధ్యమేనా?’

‘‘శతాబ్దాల చరిత్ర ఉన్న ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలను ఫ్యూచర్‌ సిటీకి తీసుకొస్తామంటూ చెప్పడం సాధ్యమేనా? హార్వర్డ్‌, ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌ పేర్లు చెప్పి ప్రజలను ఎందుకు మభ్యపెడుతున్నారు?’’ అంటూ బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం శతాబ్దాలుగా అమెరికాలోని కేంబ్రిడ్జ్‌ కేంద్రంగానే కొనసాగుతోందని పేర్కొన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయాల పరిస్థితీ అంతేనన్నారు. అలాంటి సంస్థలను ఫ్యూచర్‌ సిటీలో క్యాంపస్‌లు ఏర్పాటు చేసేలా తీసుకొస్తామని సీఎం చెప్పడం ఆచరణ సాధ్యం కాని హామీ అని విమర్శించారు. ‘‘ప్రపంచంలో మరెక్కడా క్యాంపస్‌లు ఏర్పాటు చేయని విశ్వవిద్యాలయాలు ఒక్కసారిగా తెలంగాణకు ఎలా వస్తాయి? వాటితో ప్రభుత్వం ఏమైనా ఒప్పందాలు చేసుకుందా? క్యాంపస్‌ల...