తుమ్మిడిహట్టిపై ఢిల్లీలో కీలక భేటీ

ప్రాణహిత నదిపై ప్రతిపాదిత తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణంలో కీలక ముందడుగు పడనుంది. ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై సెప్టెంబరు 1న ఢిల్లీలో తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖల ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఛైర్మన్‌ అధ్యక్షతన సేవా భవన్‌లో ఈ భేటీ జరగనుంది. తుమ్మిడిహట్టి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కొంతకాలంగా కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా మే 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసి, రెండు రాష్ట్రాల మధ్య చర్చలు నిర్వహించి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని కోరారు. అనంతరం ఈ అంశాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ప్రధానమంత్రి కార్యాలయం జలశక్తి మంత్రిత్వ...