సీతక్కకు ‘అక్షర’ రాఖీ కానుక
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రజాభవన్‌లో మంత్రి సీతక్క యువ రచయిత కడియాల సురేష్‌కుమార్‌కు రాఖీ కట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సురేష్‌కుమార్ తాను రచించిన ‘మంత్రి సీతక్క జీవిత చరిత్ర’ పుస్తకాన్ని ఆమెకు రాఖీ కానుకగా అందజేశారు. సీతక్క సామాజిక, రాజకీయ ప్రస్థానం, ప్రజా సమస్యలపై ఆమె చేసిన పోరాటాలు, ఎదుర్కొన్న సవాళ్లు, ప్రజానాయకురాలిగా ఎదిగిన తీరును పుస్తకంలో పొందుపరిచినట్లు సురేష్‌కుమార్ తెలిపారు. ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ ప్రజల మధ్య నుంచి ఎదిగిన ఆమె జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రాఖీ పండుగ రోజున తాను రచించిన జీవిత చరిత్రను సీతక్కకు కానుకగా అందించడం మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందని సురేష్‌కుమార్ చెప్పారు. అనంతరం ఆయనను సీతక్క...