సెప్టెంబరు 17 నుంచి ‘మల్లన్న’ పాదయాత్ర
హైదరాబాద్, ఆగస్టు 30 (మన విశ్వం): తెలంగాణలో బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా సెప్టెంబరు 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రకటించారు. రాష్ట్రంలోని 59 నియోజకవర్గాల్లో తమ రాజకీయ ‘సర్జికల్ స్ట్రైక్’ కొనసాగుతుందని చెప్పారు. ప్రతి గడపకూ వెళ్లి గత పాలకుల హయాంలో జరిగినట్లు తాము భావిస్తున్న దోపిడీ, బీసీలకు జరిగిన అన్యాయాలను వివరిస్తామని తెలిపారు. 2029లో తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి రావడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మల్లన్న అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజినీకుమార్ యాదవ్ సమావేశ...