మూడు దశాబ్దాలైనా.. చెదరని స్నేహం!
మూడు దశాబ్దాలు గడిచాయి.. జీవితాలు మారాయి.. ఉద్యోగాలు, వ్యాపకాలతో ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో స్థిరపడ్డారు. కానీ కళాశాల రోజుల్లో మొదలైన స్నేహబంధం మాత్రం చెక్కుచెదరలేదు. వరంగల్‌లోని సీకేఎం డిగ్రీ కళాశాలలో 1996లో బీఎస్సీ (మ్యాథ్స్) కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు 30 ఏళ్ల తర్వాత హనుమకొండలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఏళ్ల తర్వాత ఒకేచోట కలుసుకున్న మిత్రులు ఆప్యాయంగా పలకరించుకున్నారు. కళాశాల రోజుల నాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తరగతి గదిలో జరిగిన సరదా సంఘటనలు, అప్పటి చిలిపి చేష్టలను గుర్తుచేసుకుంటూ నవ్వుల్లో మునిగిపోయారు. ఒకరి కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విశేషాలను మరొకరు తెలుసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. స్నేహం కోసం యూకే నుంచి.. ఈ సమ్మేళనంలో...