‘సోనియానే గజగజ వణికింది.. నువ్వు తట్టుకుంటావా?’
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (మన విశ్వం): ‘‘కేసీఆర్‌ను రాజీనామా చేయమంటున్నావు.. ఆయనకు రాజీనామాలు కొత్త కాదు. తెలంగాణ కోసం కేసీఆర్ రాజీనామా చేస్తే ఢిల్లీనే దిగివచ్చింది. మీ నాయకురాలు సోనియాగాంధీనే గజగజ వణికింది. ఇప్పుడు కేసీఆర్ రాజీనామా చేస్తే తట్టుకునే శక్తి నీకుందా రేవంత్‌రెడ్డి?’’ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ రూపొందించిన ఛార్జిషీట్‌ను విడుదల చేసిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ రాజీనామా చేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో పదవులకు రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చిన చరిత్ర...