నాపై చర్యలా?.. ముందు సీఎంపై తీసుకోండి!
హస్తినలో కొండా సురేఖ సంచలన ఎదురుదాడి ‘పదేళ్లు తానే సీఎం అని ఎలా చెప్పుకుంటారు?’ ‘మంత్రులు, నేతల్లోనూ అసంతృప్తి.. పలువురు మంత్రులపై ఆరోపణలకు సమాధానమేంటి?’ ‘బీసీకి ఒక న్యాయం.. ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయమా?’ ‘రాజీనామా చేయమని ఎవరూ చెప్పలేదు.. అధిష్ఠానానికి అన్నీ రాతపూర్వకంగా ఇచ్చా’ పొలిటికల్ బ్యూరో , సెప్టెంబర్ 2 (మన విశ్వం): తెలంగాణ కాంగ్రెస్‌లో ‘కొండా’ కలకలం కీలక మలుపు తిరిగింది. తనపై క్రమశిక్షణ చర్యల ప్రచారం సాగుతున్న వేళ మంత్రి కొండా సురేఖ ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాపై చర్యలు తీసుకునేముందు సీఎం పై చర్యలు తీసుకోవాలి. పదేళ్లపాటు తానే ముఖ్యమంత్రి గా...