‘కొండా’ తాడోపేడో!
ఫైర్‌బ్రాండ్ నిర్ణయంపై తెలంగాణలో ఉత్కంఠ రాజీనామా చేయాలంటూ అధిష్ఠానం సంకేతాలిచ్చినట్లు ప్రచారం ససేమిరా అంటే బర్తరఫ్?.. కీలక నిర్ణయం దిశగా కాంగ్రెస్ పెద్దలు? మంత్రి పదవితోనే ఆగుతారా?.. మరో సంచలన నిర్ణయం తీసుకుంటారా? ‘నాపైనే చర్యలెందుకు?’ అంటూ ఇప్పటికే అధిష్ఠానాన్ని నిలదీసిన సురేఖ బీసీ అస్త్రం ప్రయోగిస్తారా?.. ‘కొండా’ తదుపరి అడుగుపై పార్టీల చూపు తెలంగాణ బ్యూరో, సెప్టెంబర్ 3 (మన విశ్వం): తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే ఉత్కంఠ..' కొండా ' ఏం చేయబోతున్నారు? మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరిస్తారా? లేక చివరి క్షణంలో రాజీ కుదురుతుందా? ఫైర్‌బ్రాండ్ మంత్రి కొండా సురేఖ రాజకీయ భవితవ్యంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది....