బంగారంతో పాన్‌ బ్రోకర్‌ పరార్‌!

కుత్బుల్లాపూర్‌/జగద్గిరిగుట్ట, సెప్టెంబర్‌ 6 (మన విశ్వం): నమ్మకంగా పాన్‌ బ్రోకర్‌ వ్యాపారం నిర్వహిస్తూ స్థానికులు తాకట్టు పెట్టిన బంగారంతో ఓ వ్యాపారి ఉడాయించాడన్న ఘటన జగద్గిరిగుట్టలో కలకలం రేపింది. సుమారు కిలో బంగారంతో పాటు భారీగా నగదు తీసుకుని వెళ్లిపోయాడని బాధితులు ఆరోపిస్తున్నారు. మోసపోయామని గుర్తించిన దాదాపు 35 మంది జగద్గిరిగుట్ట పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం ప్రకారం.. జగద్గిరిగుట్టలో నివాసముండే రమేష్‌ స్థానికంగా పాన్‌ బ్రోకర్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా వ్యాపారం చేస్తుండటంతో అతడిని నమ్మిన స్థానికులు అవసరాల కోసం తమ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి నగదు తీసుకున్నారు. వడ్డీలు చెల్లిస్తూ వస్తుండగా అకస్మాత్తుగా దుకాణం మూసివేయడంతో అనుమానం వ్యక్తమైంది. అతడు నివాసముంటున్న...