చీరలు లాగమని సీఎం ఆదేశించారా?
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (మన విశ్వం): అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మహిళా ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్న తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ చీరలు లాగి, గొంతులు పట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పోలీసులకు ఆదేశాలు ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత అవమానకరమని ఆరోపించారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి బాధ్యత వహించి మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నించిన తమను పోలీసులు అడ్డుకున్నారని సబిత ఆరోపించారు. ‘‘రాహుల్గాంధీ నల్ల టీషర్టు ధరించి, దానిపై మోదీ–అదానీ ఫొటో పెట్టుకొని పార్లమెంట్ వద్ద ప్రశ్నించవచ్చు....