సమస్యలు ఎన్నో.. సభలో చర్చేదీ?
ప్రత్యేక ప్రతినిధి, సెప్టెంబర్ 8 (మన విశ్వం): తెలంగాణలో ఏం జరుగుతోంది?.. అభివృద్ధిపై చర్చ ఎక్కడ?.. ప్రజల సమస్యలకు పరిష్కారాలేవి?.. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను చూస్తున్న సామాన్యుడిని ఇప్పుడు వెంటాడుతున్న ప్రశ్నలివి. అధికార–ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ వ్యక్తిగత దూషణల స్థాయికి చేరుతుంటే.. మరోవైపు విద్యార్థి నుంచి రైతు వరకు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సమస్యల జాబితా పెరుగుతోంది. విద్య, ఉపాధి.. ఫీజు రీయింబర్స్మెంట్.. 22ఏ భూములు.. జీవో 97.. రైతుబీమా.. సాగునీరు.. వర్షాభావం—ఇలా ప్రజల జీవితాలతో ముడిపడిన అంశాలెన్నో ఉన్నాయి. వీటన్నింటిపై అధికారపక్షాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షానికి, తన పనితీరును ప్రజల ముందు పెట్టేందుకు ప్రభుత్వానికి అసెంబ్లీనే అతిపెద్ద వేదిక. కానీ సమావేశాల...