గడ్డం ప్రసాద్‌ను సీఎం చేయండి.. మేం మద్దతిస్తాం!

‘‘గడ్డం ప్రసాద్‌పై కాంగ్రెస్‌కు నిజంగా గౌరవం ఉంటే ఆయనను ముఖ్యమంత్రిని చేయండి.. బీఆర్ఎస్‌ సంపూర్ణ మద్దతు ఇస్తుంది’’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సవాల్‌ విసిరారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్‌ పదవికి కులమతాలతో సంబంధం లేదని, అయినా అధికారపక్ష నేతలు పదేపదే ‘దళిత స్పీకర్‌’ అంటూ గడ్డం ప్రసాద్‌ సామాజిక వర్గాన్ని ప్రస్తావించడం సరికాదని విమర్శించారు. స్పీకర్‌ అనేది శాసనసభలో అత్యున్నత గౌరవం కలిగిన రాజ్యాంగబద్ధమైన పదవని తలసాని పేర్కొన్నారు. ఆ స్థానంలో ఉన్న వ్యక్తిని కులం ఆధారంగా కాకుండా ఆయన పదవి, బాధ్యతల ఆధారంగా గౌరవించాలన్నారు. గడ్డం ప్రసాద్‌ను పదేపదే ‘దళిత స్పీకర్‌’గా పేర్కొంటూ కాంగ్రెస్‌ నేతలే ఆయనను అవమానిస్తున్నారని...