పంచాయతీ మోటారు.. ఎవరు అమ్మేశారు?

నల్లబెల్లి, సెప్టెంబర్‌ 12 (మన విశ్వం): గ్రామానికి తాగునీరు అందించిన పంచాయతీ మోటారు ఏమైంది?.. రిపేర్‌కు ఇచ్చిన మోటారు ఎవరి చేతుల్లోకి వెళ్లింది?.. లెంకలపల్లి గ్రామంలో ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. గ్రామపంచాయతీకి చెందిన 5 హెచ్‌పీ విద్యుత్‌ మోటారును విక్రయించారంటూ ఉపసర్పంచ్‌ కోలిపాక రఘుపతి, కాంగ్రెస్‌ గ్రామ పార్టీ అధ్యక్షుడు మామిండ్ల ఐలయ్య ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. గ్రామంలోని రెండు నల్లాల బావుల ద్వారా తాగునీటి సరఫరాకు సీఆర్‌ఐ కంపెనీకి చెందిన 5 హెచ్‌పీ మోటారును వినియోగించేవారని వారు తెలిపారు. మరమ్మతుల కోసం దానిని గ్రామంలోని కీసరి నాగరాజు రిపేర్‌ షాపులో ఉంచారని చెప్పారు....