పొటాష్ బస్తాలో.. మట్టేంటి?
నల్లబెల్లి, సెప్టెంబర్ 14 (మన విశ్వం): పంటను కాపాడుతుందని కొనుగోలు చేసిన పొటాష్ బస్తాలో మట్టి కనిపించడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్లో కోరమండల్ పొటాష్ పేరుతో కల్తీ ఎరువు విక్రయించారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. ఒక్క రైతు కొనుగోలు చేసిన మూడు బస్తాల్లోనూ మట్టి కలిసిన పదార్థం కనిపించిందని చెప్పడంతో వ్యవహారం కలకలం రేపుతోంది. కొండాయిల్పల్లికి చెందిన రైతు కొనకటి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రోమోర్ సెంటర్లో మూడు పొటాష్ బస్తాలను ఒక్కొక్కటి రూ.2,200 చొప్పున రూ.6,600కు కొనుగోలు చేశారు. పంటకు వేసేందుకు ఒక బస్తా తెరవగా అందులో పెద్ద మొత్తంలో మట్టి కలిసినట్లు గుర్తించానని ఆయన...