యూరియా బస్తా వెనుక.. ‘లింకు’ దందా!
రైతుల ఫిర్యాదుతో కదిలిన వ్యవసాయ శాఖ నల్లబెల్లిలో ఎరువుల దుకాణంపై ఆకస్మిక తనిఖీ యూరియా విక్రయాలపై పంచనామా.. రికార్డుల పరిశీలన బస్తాకు అదనంగా రూ.30 వసూలు చేస్తున్నారన్న ఆరోపణ మందులు కొనకపోతే యూరియా ఇవ్వరంటూ రైతుల ఆవేదన నల్లబెల్లి, సెప్టెంబర్ 15 (మన విశ్వం): యూరియా బస్తా కావాలంటే పురుగుమందులూ కొనాల్సిందేనా?.. నిర్ణీత ధరకు మించి అదనంగా చెల్లించాల్సిందేనా?.. నల్లబెల్లి మండల కేంద్రంలో యూరియా విక్రయాలపై రైతుల నుంచి వెల్లువెత్తిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. యూరియాతో పాటు ఇతర ఎరువులు, పురుగుమందులు లేదా వ్యవసాయ ఉత్పత్తులను ‘లింకు’ పేరుతో కొనుగోలు చేయాలని కొందరు వ్యాపారులు ఒత్తిడి చేస్తున్నారని రైతులు ఫిర్యాదు చేశారు. దీనికితోడు బస్తాకు నిర్ణీత...