22ఏ చిక్కులకు.. హైపవర్‌ కమిటీ!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (మన విశ్వం): 22ఏ నిషేధిత జాబితాలో చిక్కుకుని రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన కొన్ని వర్గాల ఆస్తులకు ఊరట కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రిజిస్ట్రేషన్‌ చట్టం–1908లోని సెక్షన్‌ 22ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న ఆస్తులకు సంబంధించిన నిర్దిష్ట పెండింగ్‌ కేసులను పరిశీలించి పరిష్కరించేందుకు రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెవెన్యూ (ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌–I) శాఖ సెప్టెంబర్‌ 17న జీవో ఆర్‌టీ నెం.564 జారీ చేసింది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కమిటీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. న్యాయ, శాసన వ్యవహారాల శాఖ కార్యదర్శి సభ్యుడిగా, రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ సభ్యుడు–కన్వీనర్‌గా...