నిమ్స్‌ అధికారి ఆస్తులపై.. ఏసీబీ స్కానర్‌!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 22 (మన విశ్వం): ప్రతిష్ఠాత్మక నిమ్స్‌లో కీలక అధికారిగా పనిచేస్తున్న డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌ ఆస్తులపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నజర్‌ పెట్టింది. తెలిసిన ఆదాయ వనరులకు మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసి మంగళవారం తెల్లవారుజాము నుంచి పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. లక్ష్మీ భాస్కర్‌ నివాసం, నిమ్స్‌లోని కార్యాలయంతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులకు సంబంధించిన ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సోదాల సంఖ్యపై వేర్వేరు వివరాలు వస్తుండటంతో అధికారిక ప్రకటన వెలువడే వరకు ఖచ్చితమైన సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. ఆస్తుల లెక్కలపై ఆరా సోదాల్లో...