పట్టా కోసం.. రూ.1.30 లక్షల లంచమా!

మంచిర్యాల, సెప్టెంబర్‌ 22 (మన విశ్వం): భూమి బదలాయింపును ధ్రువీకరించి పట్టాదారు పాస్‌బుక్‌ జారీ చేసేందుకు రూ.1.30 లక్షలు లంచంగా డిమాండ్‌ చేశారన్న ఆరోపణపై మంచిర్యాల జిల్లా భీమిని మండలం పెద్దపేట గ్రామ పరిపాలన అధికారి దుర్గాప్రసాద్‌ ఏసీబీ వలకు చిక్కారు. తొలి విడతగా రూ.80 వేలు స్వీకరిస్తున్న క్రమంలో దుర్గాప్రసాద్‌తో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన పోతు రాజేందర్‌ (33)ను ఆదిలాబాద్‌ రేంజ్‌ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడి పేరుపై భూమి బదలాయింపును ధ్రువీకరించడం, పట్టాదారు పాస్‌బుక్‌ జారీకి అనుకూలంగా వ్యవహరించేందుకు దుర్గాప్రసాద్‌ రూ.1.30 లక్షలు డిమాండ్‌ చేసినట్లు అభియోగం. రూ.80 వేలు ముందుగా, పని పూర్తయ్యాక మిగిలిన...