పవర్ ప్లాంట్లలో.. అసలేం జరుగుతోంది?
హైదరాబాద్ (మన విశ్వం): తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు సరఫరాపై అధికార–ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడి మరింత పెరిగింది. రాష్ట్రంలోని థర్మల్ పవర్ స్టేషన్లలో అసలు ఏం జరుగుతోంది? విద్యుత్ ఉత్పత్తి ఎందుకు తగ్గుతోంది? బొగ్గు నిల్వల పరిస్థితి ఏంటి? యూనిట్లు ఎందుకు నిలిచిపోతున్నాయి? అన్న నిజానిజాలను క్షేత్రస్థాయిలో తేల్చేందుకు బీఆర్‌ఎస్ ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. నేడు రాష్ట్రంలోని ఐదు ప్రధాన థర్మల్ విద్యుత్ కేంద్రాలతో పాటు సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ఈ బృందాలు సందర్శించనున్నాయి. బొగ్గు నిల్వలు, సరఫరా, విద్యుత్ ఉత్పత్తి, నిలిచిపోయిన యూనిట్లు, సింగరేణి–జెన్‌కో మధ్య బకాయిలను పరిశీలించి నివేదిక రూపొందించనున్నట్లు...