అడిగేవారెవరైనా.. పురుగుమందు ఇచ్చేస్తారా?

నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నారంటూ ఆరోపణలు వివరాలు తెలుసుకోకుండానే మందులు ఇస్తున్నారని స్థానికుల ఆందోళన నల్లబెల్లిలో పురుగుమందు సేవించి వ్యక్తి ఆత్మహత్యాయత్నం ములుగు జిల్లా ఆసుపత్రిలో చికిత్స ఫిర్యాదు వస్తే చట్టపరమైన చర్యలు: ఏవో రజిత నల్లబెల్లి, సెప్టెంబర్ 25 (మన విశ్వం): నల్లబెల్లి మండలంలో పురుగుమందుల విక్రయాల్లో నిబంధనలు గాలికొదిలేస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కొనుగోలుదారుడి వివరాలు, వ్యవసాయ అవసరం తదితర అంశాలను నిర్ధారించకుండానే కొన్ని దుకాణాల్లో మందులు విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. క్షణికావేశంలో ఆత్మహత్యకు యత్నించే వారికి ఇవి సులభంగా అందుబాటులోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా నుంచి వచ్చి నల్లబెల్లి మండల కేంద్రంలో హోటల్ నిర్వహిస్తున్న షేక్ అమీర్ పాషా...