ఆర్టీసీ ఎన్నికల్లో.. ఐక్య కూటమికే దొంతి మద్దతు!

హన్మకొండ, (మన విశ్వం): ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఈయూ–ఎన్‌ఎంయూ–టీఎంయూ ఐక్య కూటమికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అక్టోబర్ 9న జరగనున్న ఎన్నికల్లో ఐక్య కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్మికులకు పిలుపునిచ్చినట్లు ఎన్‌ఎంయూ నాయకులు తెలిపారు. ఎన్‌ఎంయూ వరంగల్ రీజియన్ కార్యదర్శి యాకస్వామి, నర్సంపేట డిపో అధ్యక్షుడు జి.కె. స్వామి, కార్యదర్శి పి.ఎన్. రావుతో పాటు పలువురు నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణపై చర్చించారు. ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరికైన ‘విలీనం’ సాధన దిశగా ఐక్యంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే సూచించినట్లు నాయకులు వెల్లడించారు. ఎన్నికల్లో క్లాస్–3లో బస్సు గుర్తుకు, క్లాస్–6లో కాగడ...