ఉద్యోగ పరీక్షలకు.. తేదీలు ఖరారు!
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక సమాచారం వెల్లడించింది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న పరీక్షల తేదీలను ప్రకటించింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో వరుసగా కీలక నియామక పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు. కాలుష్య నియంత్రణ మండలిలో సహాయ శాస్త్రవేత్త పోస్టులకు అక్టోబర్ 24న పరీక్ష నిర్వహించనున్నారు. సహాయ పర్యావరణ ఇంజినీర్ పోస్టులకు అక్టోబర్ 26న పరీక్ష జరగనుంది. రోడ్లు, భవనాల శాఖలో సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్ పోస్టుల భర్తీకి నవంబర్ 6, 7 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ పట్టభద్రులు ఎదురుచూస్తున్న ఈ పరీక్షలకు తేదీలు ఖరారు కావడంతో అభ్యర్థులు...