రోకలిబండతో మోది.. భర్తను చంపిన భార్య!

మంచిర్యాల, సెప్టెంబర్‌ 29 (మన విశ్వం): మంచిర్యాల పట్టణంలో దారుణ హత్య కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తను భార్య రోకలిబండతో మోది హత్య చేసినట్లు సమాచారం. పట్టణంలోని అశోక్‌ రోడ్డులో నివాసముంటున్న వైద్య మోహన్‌పై అతడి భార్య జమున రోకలిబండతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందినట్లు తెలిసింది. మోహన్‌ ఓ యూట్యూబ్‌ న్యూస్‌ ఛానల్‌లో రిపోర్టర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున మరోసారి గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన జమున రోకలిబండతో మోహన్‌పై దాడి చేసినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి,...