గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెడదాం
ఎల్లారెడ్డి, అక్టోబర్ 2 (మన విశ్వం): మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గురువారం గాంధీజీకి ఘనంగా నివాళులర్పించారు. మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్యం, అహింస, శాంతి, సేవా మార్గాలను ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు మహాత్మా గాంధీ అని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం, పేదల పట్ల చూపిన ప్రేమ, సత్యం పట్ల నిబద్ధత ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టి స్వచ్ఛమైన సమాజం, బలమైన భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె.జగ్జీవన్,...