Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

కల్తీ చాక్లెట్ల తయారీ గుట్టురట్టు.. ఒకరి అరెస్ట్

Author MANA VISHWAM | 05 Jun 2026, 04:37 PM | Crime
కల్తీ చాక్లెట్ల తయారీ గుట్టురట్టు.. ఒకరి అరెస్ట్

హైదరాబాద్, జూన్ 05: మహానగరంలోని కల్తీ చాక్లెట్ల తయారీ గుట్టును హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ అండ్ సేఫ్టీ టీమ్ (H-FAST) రట్టు చేసింది. సీతారాంబాగ్‌ (పాత మల్లేపల్లి) ప్రాంతంలో విగ్ట్నెట్ ఫుడ్ స్పెషాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై హెచ్ ఫాస్ట్ టీమ్ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా గడువు ముగిసిన రసాయన పదార్థాలతో కల్తీ చాక్లెట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించింది. అందుకు సంబంధించి కార్తీక్ అనే వ్యక్తిని హెచ్ ఫాస్ట్ టీమ్ అరెస్ట్ చేసింది. ఈ సంస్థలో రసాయన పదార్థాలతో కల్తీ చాక్లెట్లు తయారు చేస్తున్నట్లు హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ అండ్ సేఫ్టీ టీమ్‌కు సమాచారం అందింది. దీంతో ఈ సంస్థపై సదరు టీమ్ దాడి చేసింది.