Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

నార్త్ అమెరికాలో ‘పెద్ది’ దూకుడు.. 2.2 మిలియన్ డాలర్ల మార్క్ దాటేసిన రామ్ చరణ్ సినిమా!

Author MANA VISHWAM | 06 Jun 2026, 11:51 AM | Cinema
నార్త్ అమెరికాలో ‘పెద్ది’ దూకుడు.. 2.2 మిలియన్ డాలర్ల మార్క్ దాటేసిన రామ్ చరణ్ సినిమా!

మెగాపవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. దర్శకుడు బుచ్చిబాబు స‌న‌ తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. దేశీయ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా అద్భుతమైన వసూళ్లను నమోదు చేస్తూ రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘పెద్ది’కి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ ఓపెనింగ్స్ లభించాయి. ముఖ్యంగా ప్రీమియర్ షోలు, అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించింది. విడుదలకు ముందే ఓవర్సీస్ మార్కెట్‌లో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, విడుదల తర్వాత కూడా అదే జోరును కొనసాగిస్తోంది