Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

​అవినీతిపై వరంగల్ సీపీ ఉక్కుపాదం: సీఐ, ఎస్సైలపై సస్పెన్షన్ వేటు!

Author MANA VISHWAM | 28 Jun 2026, 01:01 PM | Cinema
​అవినీతిపై వరంగల్ సీపీ ఉక్కుపాదం: సీఐ, ఎస్సైలపై సస్పెన్షన్ వేటు!

పోలీస్ శాఖలో అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని వరంగల్ పోలీస్ కమిషనర్ (సీపీ) సన్‌ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. ఒకే కేసులో అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ), ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై)లను సస్పెండ్ చేస్తూ సీపీ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
​వరంగల్ పోలీస్ కమిషనరేట్ వెస్ట్ జోన్ పరిధిలోని నర్మెట్ట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ యం. అబ్బయ్య, అలాగే గతంలో బచ్చన్నపేట ఎస్సైగా పనిచేసి ప్రస్తుతం ఏఆర్ (AR) హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ అయి ఉన్న ఎస్సై షేక్ హమీద్‌లపై గతంలో ఒకే కేసులో తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి.
​దీనిపై ఉన్నతాధికారులు లోతుగా విచారణ జరిపారు. ఈ విచారణలో వీరిద్దరూ అవినీతికి పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలతో సహా నిర్ధారణ అయినట్లు సమాచారం
​విచారణ నివేదిక ఆధారంగా సీఐ అబ్బయ్య, ఎస్సై షేక్ హమీద్‌లపై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెన్షన్ వేటు వేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.